150 క్వింటాళ్ల బోనస్ రాలేదు
నేను 150 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని డిసెంబర్‌లో కొనుగోలు కేంద్రంలో విక్రయించిన. బోనస్ రూపంలో రూ.75 వేలు రావాల్సి ఉంది. రెండు రోజుల్లోనే బ్యాంకులో జమ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు మూడు నెలలైంది. రూ.500 బోనస్ మాత్రం ఇవ్వడంలేదు. ఇప్పటికే ప్రజావాణిలో ఫిర్యాదు చేశా.
– దండవేని మల్లయ్య, దమ్మన్నపేట, ధర్మపురి
300 క్వింటాళ్లు విక్రయించిన
నేను 300 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించిన. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ధాన్యం డబ్బులు జమ అయ్యాయి. కానీ బోనస్ రూ.1.50లక్షలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు రాలేదు. ఫోన్ టింగ్‌మని మోగినప్పుడల్లా మేసేజ్ చూసుకుంటున్నా. వేరే మేసేజ్ కావడంతో నిరుత్సాహానికి గురవుతున్న.
– మడిపెల్లి రాజన్న, దమ్మన్నపేట, ధర్మపురి
150 క్వింటాళ్ల బోనస్ రాలేదు
Comments
Please login to add a commentAdd a comment