ఎంపీడీవో గెజిటెడ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్
పెగడపల్లి: ఎంపీడీవో అధికారుల గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా పెగడపల్లి ఎంపీడీవో ఎడబోయన శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా చిరంజీవి (రాయికల్), కోశాధికారిగా రామకృష్ణ (కోరుట్ల), ఉపాధ్యక్షులుగా ఎస్.రమాదేవి (జగిత్యాల రూరల్), బి.లచ్చాలు (బీర్పూర్), సంయుక్త కార్యదర్శిగా ఆర్.పద్మావతి (మేడిపల్లి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఇ.స్వరూప (కొడిమ్యాల), ప్రచార కార్యదర్శిగా ఎం.శంకర్ (కథలాపూర్) ఎన్నికయ్యారు. జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment