ఒత్తిడి జయిస్తే.. విజయమే
● పదోతరగతి, ఇంటర్ విద్యార్థులు ప్రణాళికతో చదవాలి
● యోగా, ధ్యానం చేయాలి
● సమతుల ఆహారం తీసుకోవాలి
● సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలంటున్న నిపుణులు
● మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదోతరగతి పరీక్షలు
సప్తగిరికాలనీ(కరీంనగర్): పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు.. శోధించాలన్న తపనతో సాధన చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. ఇటీవలి కాలంలో దీన్ని పలువురు రుజువు చేస్తూ పలు వార్షిక, పోటీ పరీక్షల్లో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. విద్యార్థులకు పరీక్షల కాలం వచ్చేసింది. మార్చి 5 నుంచి ఇంటర్, 21 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. కానీ, పరీక్షలంటే భయం వీడాలని, ఒత్తిడి జయిస్తే విజయం సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల
కోసం ప్రత్యేక కథనం.
విద్యార్థులు, తల్లిదండ్రులు ఇవి పాటించాలి..
● పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు మొబైల్, ఇంటర్నెట్, సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి.
● జంక్ ఫుడ్, బయటి ఆహార పదార్థాలు తీసుకోవద్దు.
● పండ్ల రసాలు, స్వీట్, నెయ్యి, వాటర్ మిలాన్, డ్రై ప్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగాలి.
● ప్రతీరోజు యోగా, ధ్యానం చేయాలి. దీనివల్ల చదువుపై ఏకాగ్రత వస్తుంది. పద్మాసనం, శశాంకాసనం, గోముకాసనం, శవాసనం వేస్తే మంచిది.
● రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలి. 15 నుంచి 20 నిమిషాల శారీరక వ్యాయామం చేయాలి.
● విద్యార్థులు మంచి ఆహారం, విశ్రాంతి తీసుకునేలా తల్లిదండ్రులు చూడాలి. ఇతర విద్యార్థులతో పోల్చవద్దు.
● ఎక్కువ సమయం చదవాలని ఒత్తిడి చేయొద్దు. పిల్లలతో స్నేహంగా ఉండాలి.
● టీచర్లను సంప్రదిస్తూ సలహాలు తీసుకోవాలి.
హెల్ప్‌లైన్ నంబర్‌లో సంప్రదించాలి
పరీక్షల సమయంలో మానసిక రుగ్మతలకు గురయ్యే విద్యార్థుల కోసం తెలంగాణ సైకాలజిస్ట్‌స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత కన్సల్టేషన్, కౌన్సెలింగ్ కోసం 94404 88571 లేదా 040–35717915 నంబర్‌లో సంప్రదించాలి.
ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు
జిల్లా పదోతరగతి ఇంటర్ ఫస్టియర్ సెకండియర్
కరీంనగర్ 12,516 17,799 17,763
జగిత్యాల 12,059 7,067 7,370 రాజన్న సిరిసిల్ల 6,768 5,065 4,245 పెద్దపల్లి 6,393 5,844 5,141
క్లిష్టమైన టాపిక్స్‌పై ఫోకస్
నేను ఉదయం 3:30 గంటలకే నిద్ర లేచి, చదువుకునేదాన్ని. క్లిష్టమైన టాపిక్స్‌పై ఫోకస్ పె ట్టాను. అర్థం కాని పాఠ్యాంశాలను టీచర్లను అడిగి, మళ్లీ చె ప్పించుకున్న. మా అమ్మానాన్న, ఉపాధ్యాయులు సహకారం అందించారు. నేను పడిన కష్టానికి 10 జీపీఏ వచ్చింది. – దుర్శెట్టి నందిని,
2023–24 ఎస్సెస్సీ 10 జీపీఏ, కరీంనగర్
టెన్షన్ పడొద్దు
విద్యార్థులు టెన్షన్ పడకుండా పరీక్షలకు హాజరుకావాలి. మా పిల్లలకు ఇంటర్ విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో వివరించాం.
– ఎ.నిర్మల, ప్రిన్సిపాల్,
ప్రభుత్వ బాలికల కళాశాల, కరీంనగర్
ఒత్తిడి జయిస్తే.. విజయమే
ఒత్తిడి జయిస్తే.. విజయమే
ఒత్తిడి జయిస్తే.. విజయమే
Comments
Please login to add a commentAdd a comment