కోనరావుపేట(వేములవాడ): ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.. ఆమె భర్త నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ రెండు ఘటనలకు ఓ వ్యక్తి కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆమె మృతదేహంతో అతని ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. వారి వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం బావుసాయిపేట శివారులోని రామన్నపల్లెకు చెందిన బత్తుల మల్లయ్య గత నెల 19న రామన్నపల్లె శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో అతని భార్య రేణ(28) ముగ్గురు పిల్లలతో కలిసి, కొన్ని రోజులుగా వేములవాడ మండలంలోని నాంపల్లిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతోంది. గురువారం అద్దె ఇంట్లోనే ఉరేసుకుంది. అయితే, రేణ ఆత్మహత్య, ఆమె భర్త మృతికి రామన్నపల్లెకు చెందిన అంజయ్య కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. రేణ మృతదేహంతో అతని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అంజయ్య ఇంటి పైకప్పును ధ్వంసం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రామన్నపల్లెలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై ప్రశాంత్‌రెడ్డిని వివరణ కోరగా.. రేణ ఆత్మహత్యపై బాధిత కుటుంబసభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.
¯ðlÌS {MìS™èl… Æøyýl$z {ç³Ð]l*-§ýl…-ÌZ ˘ ¿ýæÆý‡¢ Ð]l$–†
రెండు ఘటనలకు ఓ వ్యక్తి కారణమని కుటుంబీకుల ఆరోపణ
మృతదేహంతో అతని ఇంటి ఎదుట ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment