మహాశివరాత్రి జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు
వేములవాడ: ఎములాడ రాజన్న ఆలయంలో ఈ నెల 23 నుంచి 28 వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు 29 మంది సభ్యులతో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ఏర్పాటుకు కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు సభ్యులు అనుముల చంద్రం, వడ్డేపల్లి వెంకటరమణ, కె.రాజిరెడ్డి, సి.విజయలక్ష్మి, సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమురయ్య, సంద్రగిరి శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, పులి రాంబాబు, తూము సంతోష్, వకుళాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, సంగ స్వామి, జగన్మోహన్ రెడ్డి, చేపూరి గంగయ్య, చింతపల్లి రామస్వామి, కాయతి నాగరాజు, తొట్ల అంజయ్య, ఏనుగు రమేశ్ రెడ్డి, సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, ధర్న మల్లేశం, ఒలిమినేని నిత్యానందరావు, గొట్టె ప్రభాకర్, బుస్సా దశరథం, తాటికొండ పవన్, ముప్పిడి శ్రీధర్, సుగూరి లక్ష్మి, తోట లహరి కృతజ్ఞతలు తెలిపారు.
కుక్క దాడిలో 10 మందికి గాయాలు
సిరిసిల్ల కల్చరల్: కుక్క దాడిలో 10 మంది గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల బీవైనగర్‌కు చెందిన ఉమాదేవి, రాణి, లత, రామచంద్రం, లక్ష్మి, భూలక్ష్మి, విజయ, విట్టల్, శేఖర్‌తోపాటు ఐదేళ్ల పాప వైశాలిపై గురువారం కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో అందరికీ గాయాలయ్యాయి. బాధితులను సుందరయ్యనగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డాక్టర్ సాహితి వారికి చికిత్స అందించారు.
కోరుట్లలో తల్లీకూతురికి..
కోరుట్ల: పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన వెల్లుల్ల గౌతమి, ఆమె కూతురు ధాన్విలపై గురువారం రాత్రి కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానికులు ఆ కుక్కను చంపేశారు.
నాటుసారా తరలిస్తున్న వ్యక్తిపై కేసు
పాలకుర్తి(రామగుండం): నాటుసారా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం ఎకై ్సజ్ సీఐ మంగమ్మ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకుర్తి మండలంలోని జీడీనగర్‌కు చెందిన పల్లపు వెంకట్ గురువారం ద్విచక్రవాహనంపై నాటుసారా తరలిస్తున్నాడు. అదే సమయంలో జీడీనగర్ నుంచి బసంత్‌నగర్ వెళ్లే దారిలో ఎకై ్సజ్ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. వెంకట్‌ను ఆపి, తనిఖీ చేయగా 8 లీటర్ల నాటుసారా లభ్యమైంది. నాటుసారా స్వాధీనం చేసుకొని, అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. హెడ్‌కానిస్టేబుల్ ఖదీర్, కానిస్టేబుళ్లు శ్రవణ్, నరేశ్, రాజు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment