యూరియా దొరుకుతలె..
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో యూరియా కొరత రైతాంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. యాసంగిలో మొక్కజొన్న, వరి సాగు చేసిన రైతులు యూరియా కోసం గంటల తరబడి సింగిల్ విండో, అగ్రోస్ సేవా కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. క్యూలో నిలబడే ఓపిక లేక పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు క్యూ లైన్లలో పెడుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు తమకు నచ్చిన రేటుకు విక్రయించే పనిలో పడ్డారు.
జిల్లాకు 38 వేల మెట్రిక్ టన్నులు
యాసంగిలో జిల్లాకు 38 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించారు. ఇప్పటి వరకు 34,900 మె.ట. రాగా, ఇంకా 3,100 మె.ట. రావాల్సి ఉంది. జిల్లాలోని అన్ని సొసైటీల్లో యూరియా అయిపోవడంతో పాటు, మార్క్‌ఫెడ్ గోదాంలో స్టాక్ లేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో యూరియా నిల్వ చేసే పాయింట్ లేక, కరీంనగర్‌కు రైల్వే వ్యాగన్ వచ్చినప్పుడు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వే వ్యాగన్ వచ్చినప్పుడు కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి డిమాండ్ ఉండటంతో కోటాకు మించి జిల్లాకు యూరియా ఇవ్వడం లేదు. దీంతో మొక్కజొన్నను అధికంగా సాగు చేసిన మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, కోరుట్ల, రాయికల్ మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ప్రస్తుతానికి మంచిర్యాల నుంచి 500 టన్నులు, రంగారెడ్డి జిల్లా నుంచి 1,000 టన్నుల యూరియాను ఆగమేఘాల మీద తెప్పిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో రైల్వే వ్యాగన్ ద్వారా 300–400 మొ.ట వచ్చే అవకాశముంది. మొక్కజొన్న జల్లు దశలో ఉండటంతో తప్పనిసరిగా యూరియా వేయాల్సి ఉండగా, రైతులంతా ఒక్కసారిగా పరుగులు పెడుతున్నారు. దీనికి తోడు యూరియా దొరుకుతుందో లేదోనని అవసరం ఉన్నా, లేకున్నా బస్తాల కొద్ది నిల్వ చేస్తున్నారు. సొసైటీ గోదానికి లారీ లోడ్ వచ్చిదంటే అందులోని 450 బస్తాలు గంటలోపే ఖాళీ అవుతున్నాయి.
అన్నదాతలను వేధిస్తున్న యూరియా కొతర
క్యూలైన్లలో ఆధార్ కార్డులు.. గంటల తరబడి పడిగాపులు
మొక్కజొన్న సాగుతో భారీగా పెరిగిన వాడకం
‘జిల్లాలో యాసంగిలో వరి
దాదాపు 3 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 50 వేల ఎకరాల్లో సాగైంది. ఈసారి వరిని తగ్గించి, మొక్కజొన్న సాగును పెంచారు. గతేడాది మొక్కజొన్న 26 వేల ఎకరాల్లో సాగవగా, ఈసారి 50 వేల ఎకరాల్లో వేశారు. దీంతో వరి ఎకరాకు 2 బస్తాల యూరియా వేయాల్సి ఉండగా 4 బస్తాల వరకు వేస్తున్నారు. అలాగే మొక్కజొన్న ఎకరాకు రెండున్నర బస్తాలకు గాను 9–12 బస్తాలు వేస్తున్నారు. ఇందుకు కారణం, యూరియాపై సబ్సిడీ ఉండి బస్తా ధర రూ.300 లోపే ఉండగా, డీఏపీ బస్తా రేటు రూ.1,600–1,700 ఉండటంతో యూరియా వాడకం పెరిగింది. దీంతో డిమాండ్‌కు సరిపడా యూరియా
రైతులకు దొరకడం లేదు’.
మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా జిల్లాలోని 51 సొసైటీలకు యూరియా అందుతుంది. యూరియా కంపెనీలు 50 శాతం మార్క్‌ఫెడ్, మరో 50 శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తాయి. జిల్లాలో ప్రైవేట్ డీలర్లు లేకపోవడంతో సబ్‌డీలర్ల ద్వారా యూరియా తక్కువ మొత్తంలో వస్తుంది. సబ్‌డీలర్లు రవాణా, హమాలీ ఖర్చులు చూసుకుని ప్రభుత్వ ధరకంటే బస్తాపై రూ.20–30 అధికంగా తీసుకుంటున్నారు. కాగా సొసైటీల ద్వారా ప్రభుత్వ ధరకే యూరియా విక్రయిస్తుండటంతో ఎక్కువగా రైతులు ఇక్కడే తీసుకుంటున్నారు. మల్లాపూర్ మండలంలోని కొన్ని సొసైటీల్లో బస్తాపై రూ.5–10 ఎక్కువ తీసుకుంటున్నట్లు తెలిసింది.
మార్క్‌ఫెడ్
ద్వారా
సొసైటీలకు..
యూరియా దొరుకుతలె..
యూరియా దొరుకుతలె..
Comments
Please login to add a commentAdd a comment