ప్రతీ ఆస్పత్రిలో మౌలిక వసతులుండాలి
జగిత్యాల: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆస్పత్రి స్థాపన చట్టం 2010 ప్రకారం మౌలిక వసతులన్నీ ఉండాలని రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్ జాన్‌బాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోగులకు వేచి ఉండాల్సిన స్థలం, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే నివారణకు రక్షణ చర్యలు, ఆస్పత్రి నుంచి వచ్చే వ్యర్థమైన నీటిని శుభ్రపర్చే ఎస్టీపీ ట్యాంక్‌లు, బయోమెడికల్ వేస్టేజీకి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్నారు. ల్యాబ్‌లు సై తం అన్ని వసతులతో కూడి ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ప్రైవేటు ఆస్పత్రుల్లో ల్యాబ్‌లు, మెడికల్‌షాపులు, ఎక్స్‌రే ప్లాంట్లు, ఆపరేషన్ థియేటర్స్‌ను పరిశీలించారు. ఆయన వెంట డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు జైపాల్‌రెడ్డి, శ్రీని వాస్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, భూమేశ్వర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment