జగిత్యాలరూరల్: కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో పాస్‌పోర్ట్ సేవలను ప్రైవేటీకరించి, 4 రెట్ల ఫీజు పెంచడంపై ప్రవాసీ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉ న్నారని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీమ్‌రెడ్డి అన్నారు. పెంచిన ఫీజు వెంటనే తగ్గించాలని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశాంగ మ ంత్రి ఎస్.జైశంకర్‌లకు మెయిల్, ఎక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. విదేశీ మారక ద్ర వ్యాన్ని పొందే దేశాల్లో మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయన్నారు. మనకంటే చాలా చిన్న దేశం బాంగ్లాదేశ్ తమ ప్రవాసులకు ప్రోత్సాహకాలు ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే తక్కువ వేతనాలు, బలవంతపు శ్రమ, పెరుగుతు న్న జీవన వ్యయంతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు పాస్‌పోర్ట్ సేవల ఫీజు పెంపు మరింత అన్యా యం చేస్తుందని తెలిపారు. సౌదీ అరేబియాలో 200 –300 రియాళ్లు (గతంలో 50–75), యూఏఈలో 200–350 దిర్హామ్‌లు (గతంలో 50–100), ఒమన్‌లో 25–35 రియాళ్లు (గతంలో 5–10), బహ్రెయిన్‌లో 20–30 దినార్లు (గతంలో 5–10), ఖతార్‌లో 150–200 రియాళ్లు, కువైట్‌లో 23.750 దినార్లు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఫీజు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ మంద భీమ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment