‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం వద్దు
మల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం కానీయొద్దని జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన ఆయన రికార్డులు పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇంటి పనులను పరిశీలించారు. మండలానికో మోడల్ గ్రామాన్ని ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యేవరకూ విడతల వారీగా రూ.5లక్షలు నేరుగా ఖాతాల్లోకి జమవుతాయని వివరించారు. కార్యక్రమంలో ఎండీపీవో శశికుమార్‌రెడ్డి, మండల పరిషత్ సూపరింటెండెంట్ రజని, సినియర్ అసిస్టెంట్ మహేశ్, ఈజీఎస్ ఎపీవో సతీష్, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment