సదరెం మరింత సులభతరం
జగిత్యాల: సదరెం సే వలు మరింత సులభతరం కానున్నాయని, కేంద్రం 21 రకాల కేటగిరీలను చేర్చిందని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ తెలిపారు. మీసేవ కేంద్రాల్లో వచ్చేనెల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని, స్వయంగా దివ్యాంగులే చేసుకునేలా యూనిక్ డిసబులిటీ ఐడీ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో అప్‌లై చేసుకోవాలని కోరారు. స్మార్ట్‌గా సదరెం సర్టిఫికెట్ వస్తుందని, ఇంతకుపూర్వం ఏ4 సైజ్‌లో జారీ అయ్యేవని, ఇకపై కార్డు సైజులో వస్తాయని పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించే సదరెం శిబిరానికి హాజరు కావాలని సూచించారు.
నేటి నుంచి మద్యం షాపుల బంద్
జగిత్యాలక్రైం: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 25న సాయంత్రం నాలుగు గంటల నుంచి 27 సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు.
మార్కెట్‌యార్డుకు మూడు రోజులు సెలవులు
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల మార్కెట్‌యార్డుకు మూడు రోజుల సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా ఈనెల 26 నుంచి 28 వరకు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. మా ర్చి ఒకటో తేదీ నుంచి యార్డులో యథావిధిగా కొనుగోళ్లు సాగుతాయని వివరించారు.
రెండు బైకులు ఢీ: ఇద్దరికి గాయాలు
ధర్మపురి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని దమ్మన్నపేట, రాజారం గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో రాజారం గ్రామానికి చెందిన జెల్ల సత్తయ్య, దూడ రాజయ్యకు తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
జగిత్యాల క్రైం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జగిత్యాల రూరల్ ఎస్సై సదాకర్ వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లికి చెందిన అత్తినె గంగాధర్(50) సోమవారం పని నిమిత్తం బైక్‌పై జగిత్యాల వచ్చాడు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా నర్సింగాపూర్ శివారులో ధరూర్ నుంచి మోతె వైపు వెళ్తున్న బోలెరో అతివేగంగా వచ్చి, ఢీకొట్టింది. ఈ ఘటనలో గంగాధర్‌కు బలమైన గాయాలయ్యాయి. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
సదరెం మరింత సులభతరం
Comments
Please login to add a commentAdd a comment