కోనరావుపేట: కళాశాల నుంచి వస్తూ అదృశ్యమైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో రైలు కిందపడి మృతి చెందినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన పొట్ల బాలమల్లు– మంజుల దంపతుల కుమారుడు రాకేశ్ (18)హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వస్తూ సిరిసిల్ల బస్టాండ్‌లోని ధర్మారం గ్రామానికి వెళ్తున్న ఆటోలో బ్యాగు పెట్టాడు. తర్వాత కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాకేశ్ హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో సూసైడ్ నోట్ రాసి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. అమ్మ, నాన్న క్షమించండి. నాకు బతకాలని లేదు. నా చావుకు కారణం ఎవరు కాదు అని సూసైడ్ నోట్‌లో అంది. పోలీసులు ఫోన్‌లో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రాకేశ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment