యువత ఉపాధి వైపు అడుగులు వేయాలి
మల్యాల: ప్రభుత్వ పథకాలను సద్వినియో గం చేసుకుంటూ యువత స్వయం ఉపాధివైపు అడుగులు వేయాలని డీఆర్డీవో పీడీ రఘువరన్ అన్నారు. మండలంలోని మద్దుట్లలో ఉపాధి హామీ నిధులు ఏర్పాటు చేసిన పశువుల పాకను మంగళవారం పరిశీలించారు. పోతారంలో ఉపాధి హామీ కింద చేపట్టిన కందకం పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. మండలకేంద్రంలో ఉన్నతి పథ కం కింద పుట్టగొడుగుల పెంపకంపై ఆరురోజులు శిక్షణ పొందిన 70 మంది యువతకు సర్టిఫికెట్లు అందించారు. అడిషనల్ డీఆర్డీవో మదన్‌మోహన్, ఎంపీడీఓ స్వాతి, ఏపీఓ శ్రీనివాస్, ఈసీ మనోజ్, టెక్నికల్ అసిస్టెంట్ జలపతి రెడ్డి, లావణ్య, శిక్షకులు బాలస్వామి, విజయభారతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment