మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయ శివారులో ఈత చెట్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన గౌడ కులస్తులు మూడేళ్ల క్రితం ఐదు ఎకరాల్లో సుమారు 6 వేల వరకు ఈత చెట్లు నాటారు. వాటిపై ఆధారపడి కొద్దిరోజుల నుంచి కల్లుగీస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి ఈత చెట్లు దగ్ధమవుతున్నట్లు గౌడ కులస్తులకు సమాచారం రావడంతో వారంతా అక్కడికి వెళ్లారు. అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటన ప్రాంతానికి వెళ్లి మంటలు ఆర్పారు. అప్పటికే దాదాపు 500కుపైగా ఈత చెట్లు దగ్ధమైనట్లు గీత కార్మికులు తెలిపారు. ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా..?, కుట్రనా..? అనేది విచారణ చేపట్టాలని గీత కార్మికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment