ముగిసిన అంతర్రాష్ట్ర క్రీడలు
● క్రీడల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ రాజేంద్రనగర్, ఉత్తర తెలంగాణ జట్టు
● విజేతలకు బహుమతులు ప్రదానం
జగిత్యాల అగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న అంతర్రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ పోటీలకు వ్యవసాయ వర్సిటీ డీన్ ఆప్ అగ్రికల్చర్ డాక్టర్ కె. ఝాన్సీరాణి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసంతోపాటు స్నేహభావం పెంపొందుతుందన్నారు. వ్యవసాయ కళాశాల అ సోసియేట్ డీన్ డాక్టర్ భారతీ నారాయణ్ భట్ మా ట్లాడుతూ, రాష్ట్రస్థాయి వర్సిటీ క్రీడలకు పొలాస కళాశాల వేదిక కావడం అభినందనీయమన్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ శ్రీలత మా ట్లాడుతూ పోటీల్లో పాల్గొడడం వల్ల క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. వ్యవసాయ వర్సిటీ క్రీడా పరిశీలకులు డాక్టర్ సురేశ్, వర్సి టీ నాన్ టీచింగ్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, జయరాం, కళాశాల స్టూడెంట్ ఆఫైర్ కన్వీనర్ మహేశ్ రెడ్డి, క్రీడా ఇన్‌చార్జి రత్నాకర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, నాన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఓవరాల్ చాంపియన్ షిప్ రాజేంద్రనగర్ జట్టు
రాష్టస్థాయి క్రీడల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్‌ను రాజేంద్రనగర్ జట్టు కై వసం చేసుకోగా, సాంస్కృతిక విభాగంలో ఓవరాల్ చాంపియన్ షి ప్‌ను ఉత్తర తెలంగాణ జట్టు కై వసం చేసుకుంది. క్రికెట్‌లో దక్షిణ తెలంగాణ జట్టు, వాలీబాల్‌లో మధ్య తెలంగాణ జట్టు, బాల్ బ్యాడ్మింటన్‌లో ఉత్తర తెలంగాణ జట్టు, షటిల్ బ్యాడ్మింటన్‌లో రాజేంద్రనగర్ జట్టు, టేబుల్ టెన్నీస్‌లో రాజేంద్రనగర్ జట్టు, చెస్‌లో మధ్య తెలంగాణ జట్టు, కార్యమ్‌లో మధ్య తెలంగాణ జట్టు విజయం సాధించాయి. వివిధ జోన్లకు చెందిన క్రీడాకారులు బహుమతులు అందుకున్నారు.
ముగిసిన అంతర్రాష్ట్ర క్రీడలు
Comments
Please login to add a commentAdd a comment