సాంబశివుని సన్నధిలో గీతాహవన యజ్ఞం
బుగ్గారం: మండలకేంద్రంలో కొలువైన శ్రీసాంబశివుని నాగేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గీతాహవన యజ్ఞాన్ని కనులపండువగా నిర్వహించారు. విశ్వశాంతి, పర్యావరణ పరిరక్షణ, లోకకల్యాణార్థం ఆదిలాబాద్ జిల్లా రోటిగూడెంకు చెందిన శ్రీహరిమౌనస్వామిజీ పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ మసర్తి రాజిరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమపూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఆలయ అర్చకులు సాత్పడి రంగయ్య, వేద పండితులు శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రి, రామస్వామి, కంచర్ల శివశంకరాచార్యులు, ఆగస్త్య మహారాజ్, ప్రమోద్‌శర్మ, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, శ్రీమద్భగద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment