పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
● ఎస్పీ అశోక్‌కుమార్ ● కేంద్రాల పరిశీలన
జగిత్యాలక్రైం/మల్లాపూర్: ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల వద్ద శాంతిభద్రతలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లావ్యాప్తంగా 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉంటుందని, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయన్నారు. ఎవరైనా నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీఐలు నిరంజన్‌రెడ్డి, ఎస్సై రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment