పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలి
రాయికల్: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుంగా అన్ని రకాల వసతులు కల్పించాలని డీఈవో రాము తెలిపారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం, సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థులు కూర్చునేందుకు సరిపడా బెంచీలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఆయన వెంట ఉపాధ్యాయులు గంగాధర్, రాజశేఖర్, సీఎం శర్మ, పద్మ, తరంగిణి, వేణు, రజిత, ప్రశాంత్, రమేశ్, నర్సయ్య పాల్గొన్నారు.
పింఛన్ ఇప్పించండి సారు
జగిత్యాల: పింఛన్ ఇప్పించాలంటూ ఓ తెలంగాణ ఉద్యమకారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాధనకు ఉద్యమం చేశానని, ప్రత్యేక రాష్ట్రం ప్రకటించేంతవరకూ గుండుతోనే ఉన్నానని, నిరాహార దీక్షలు చేసినా.. కవితలతో ఉద్యమానికి అండదండలు అందించినా ప్రభుత్వం కనీసం పింఛన్ కూడా మంజూరు చేయడంలేదని అంటున్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన తునికి పెద్ద గంగారాం తెలంగాణ ఉద్యమంలో వినూత్న రీతిలో ఉద్యమం చేపట్టారు. తెలంగాణ వచ్చేవరకూ గుండుతోనే ఉంటానని ప్రతినబూనారు. నిత్యం ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి పింఛన్ మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని చెప్పిందని, ఇప్పటివరకు స్పందన లేదని, కనీసం పింఛన్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలి
Comments
Please login to add a commentAdd a comment