స్వగ్రామానికి చేరిన యువకుడు
జగిత్యాలక్రైం: మోసపూరిత విదేశీ నియామక సంస్థ చేతుల్లో మోసపోయిన కొడిమ్యాల మండలం చెప్యాలకు చెందిన వలస కార్మికుడు కడకుంట్ల శ్రీకాంత్ పలువురి సహాయంతో మంగళవారం స్వగ్రామం చేరాడు. శ్రీకాంత్‌ను 40 రోజల క్రితం జగిత్యాలకు చెందిన మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ ఎలక్ట్రిషీయన్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చి దుబాయ్ పంపించింది. అక్కడికి చేరిన అనంతరం లేబర్ ఉద్యోగంలో చేర్పించారు. ఆ పని చేయబోనని శ్రీకాంత్ అనడంతో పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని 7300 దిరమ్స్ (ఇండియా రూ.2లక్షలు) చెల్లించాలని కంపెనీ యాజమాన్యంతోపాటు, కేరళకు చెందిన ఓ ఏజెంట్ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐసెల్ కన్వీనర్ షేక్ చాంద్‌పాషాను ఆశ్రయించారు. ఆయన దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు. స్పందించిన ఎంబసీ వారు కంపెనీ యాజమాన్యాన్ని మందలించడంతో శ్రీకాంత్‌ను స్వగ్రామానికి పంపించేందుకు నిరాకరించారు. దీంతో ఇండియన్ ఎంబసీ దుబాయ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. లేబర్ కోర్టు విచారణ జరపగా శ్రీకాంత్ కోర్టులో నెగ్గాడు. దీంతో కంపెనీ యాజమాన్యం ఫిర్యాదును కొట్టివేసి అతని పాస్‌పోర్టును శ్రీకాంత్‌కు అప్పగించడంతో మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment