ఎములాడ దారిలో..
● వైభవంగా రాజన్న జాతర షురూ ● తరలివస్తున్న భక్తులు ● నేడు మహాశివరాత్రి వేడుకలు ● రూ.2.39 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు ● గుడి చెరువులో శివార్చన కార్యక్రమాలు ప్రారంభం ● పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం, విప్ ఆది, టీటీడీ అర్చకులు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎములాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు తరలివస్తున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్నను దర్శించుకుని, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. జాగరణ కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసి కేవలం లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రూ.2.39 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో శివార్చనలో భాగంగా 1,500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో జాగరణ చేసే భక్తులకు గుడి చెరువు వేదిక కానుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పేయిడ్ పాస్‌లను అధికారులు జారీ చేశారు. జాతరకు ఈసారి 4 లక్షల మంది వరకు వివిధ ప్రాంతల నుంచి భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు సైతం స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు.
నేటి ఉత్సవాల్లో..
వేకువజామున 3.30 నుంచి 4 గంటల వరకు ఆలయ శుద్ధి, మంగళవాయిద్యాలు
ఉదయం 4 నుంచి 4.25 వరకు సుప్రభాత సేవ
సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శివస్వాములకు ప్రత్యేక దర్శనం
సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మంటపంలో మహాలింగార్చన
రాత్రి 11.35 నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ కాలమందు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
ఎములాడ దారిలో..
ఎములాడ దారిలో..
ఎములాడ దారిలో..
Comments
Please login to add a commentAdd a comment