మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు
జగిత్యాలరూరల్/సారంగాపూర్/మల్లాపూర్: మహాశివరాత్రికి జిల్లాలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. జగిత్యాల మండలం పొలాసలోని పౌలస్తేశ్వరస్వామి, సహస్ర లింగాల, పొరండ్లలోని రామలింగేశ్వరస్వామి, జాబితాపూర్‌లోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కోరిన కొర్కెలు తీర్చే కనకసోమేశ్వరుడు
మల్లాపూర్ మండలకేంద్రంలోని సోమేశ్వర కొండపై కొలువైన శ్రీకనకసోమేశ్వరుడు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచారు. ప్రకృతి అందాల మధ్య కొండపై వెలిసిన స్వామివారి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఉత్సవాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
దుబ్బరాజన్నకు పటిష్ట పోలీస్ బందోబస్తు
సారంగాపూర్ మండలంలోని దుబ్బరాజన్న ఆలయంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎ స్పీ అశోక్ కుమార్ తెలిపారు. దుబ్బరాజన్న స్వామి వారిని దర్శించుకున్న ఆయన పోలీసులు, ఆలయ, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
స్వామివారిని దర్శించుకున్న బీఆర్‌ఎస్ ప్రముఖులు
దుబ్బరాజన్న స్వామివారిని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బా పురెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత దర్శించుకున్నారు. అర్చకులు వారికి ఆశీర్వాదం అందించి, స్వామివారి ప్రసాదాలు బహూకరించారు.
శానిటేషన్‌పై నిర్లక్ష్యం వద్దు
దుబ్బరాజన్న జాతరలో పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఆర్‌డీవో, డీపీవో మదన్‌మోహన్ అన్నారు. దుబ్బరాజన్న జాతర స్థలం, ఆలయ పరిసరాలు, కోనేరును పరిశీలించారు. వివిధ పంచాయతీల నుంచి 100 మంది సిబ్బందిని శానిటేషన్ కోసం నియమించామన్నారు. 14 మంది పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో, ఎంపీవో మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటారని పేర్కొన్నారు.
మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు
మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు
Comments
Please login to add a commentAdd a comment