వాటర్‌బెల్‌తో ప్రయోజనం
ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్తాం. పీరియడ్ తర్వాత పీరియడ్ జరుగుతుంది. మధ్యలో వాటర్ బెల్ ఉంటే మాకు ప్రయోజనంగా ఉంటుంది. పీరియడ్ తర్వాత మేం మరో పీరియడ్‌లోకి వెళ్లిపోతాం. వాటర్ బెల్ అవకాశం కల్పించాలి.
– సాయిసవర్ణిక, విద్యార్థి
నీరు తాగడం ముఖ్యం
ఎండకాలంలో విద్యార్థులకు నీరు ఎంతో ముఖ్యం. కోవిడ్ సమయంలో వాటర్‌బెల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ దానిని పునరుద్ధరించాలి. మంచినీరు తాగడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు. – బైరం హరికిరణ్,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
అమలు తప్పనిసరి చేయాలి
విద్యార్థులు గంటకోసారి నీరు తాగేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఎండకాలంలో తగినన్ని నీరు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. కేవలం ఇంటర్వెల్ సమయంలోనే తాగుతున్నారు.
– మచ్చ శంకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రెండు లీటర్లు తీసుకోవాలి
విద్యార్థులు ప్రతిరోజూ రెండు లీటర్ల నీరు తీసుకోవాలి. అప్పుడే శరీ రంలోని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. నీరు తాగడం.. మూత్ర విసర్జన చేయడం ముఖ్య మని విద్యార్థుల్లో అవగాహన పెంచాలి. రెండు గంటలకోసారి 250 మి.లీ నీరు తాగడం మంచిది. – ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, ఫిజీషియన్
వాటర్‌బెల్‌తో ప్రయోజనం
వాటర్‌బెల్‌తో ప్రయోజనం
వాటర్‌బెల్‌తో ప్రయోజనం
Comments
Please login to add a commentAdd a comment