తాగునీటి ఎద్దడి రానీయొద్దు
కోరుట్లరూరల్: వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. మండలంలోని పైడిమడుగు గ్రామాన్ని మంగళవారం సందర్శించిన ఆమె గ్రామంలో చేపడుతున్న పారిశుధ్య పనులపై ఆరా తీశారు. చేతిపంపును పరిశీలించి తాగునీటి సమస్య తెలుసుకున్నారు. పారిశుద్యంపై అలసత్వం తగదని, ఇంటి పన్నులు వందశాతం వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో జివాకర్, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ రామకృష్ణ, కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు.
వైజ్ఞానిక ప్రదర్శనలతో నైపుణ్యం
రాయికల్: వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యం పెంపొందుతుందని జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలను సందర్శించారు. విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల ఆసక్తి కనబర్చడం ద్వారా శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. హెచ్‌ఎం అభయ్‌రాజ్, ఎంపీవో సుష్మ, ఎంఈవో శ్రీపతి రాఘవులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్‌పర్సన్ బొప్పారపు మానస, ఉపాధ్యాయులు బెజ్జంకి హరికృష్ణ, కడకుంట్ల వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడి రానీయొద్దు
Comments
Please login to add a commentAdd a comment