జగిత్యాలటౌన్: ఎమ్మెల్సీగా నరేందర్‌రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం గొప్ప నిర్ణయమన్నారు. ఐటీఐ కళాశాల అప్‌గ్రేడ్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. తనను ఆదరించినట్లుగానే నరేందర్‌రెడ్డికి అండగా నిలవాలని కోరారు. నాయకులు బండ శంకర్, గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, ధర రమేశ్, మన్సూర్, నేహాల్, జున్ను రాజేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment