మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు
ధర్మపురి/సారంగాపూర్(జగిత్యాల)/వెల్గ టూర్(ధర్మపురి): దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి బుధవారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సూర్యోదయానికి ముందు నుంచే పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు.
దుబ్బరాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి–అహల్య దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా జడ్జి ఎస్.నారాయణ, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సాలియానాయక్, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్ హాజరయ్యారు. కోటిలింగాల కోటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్వామివారికి అభిషేకం చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment