
పోలింగ్‌కు వేళాయె
● పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం ● నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 773 పోలింగ్ కేంద్రాలు ● ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ● 12రకాల గుర్తింపు కార్డులతో ఓటేసేందుకు అనుమతి ● వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు
– 8లోu
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజకవర్గాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌లో మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్వో పమేలాసత్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్స్ కోసం 499, టీచర్స్ కోసం 274, ఉమ్మడిగా 93 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, ఓటరు కార్డుతో సహా 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని తెలిపారు. పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ పోటీలో 15 మంది ఉన్నారు.
– సాక్షిప్రతినిధి, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment