
‘ఏజెంట్లు, సిబ్బందికి ఫోన్ అనుమతి లేదు’
మల్లాపూర్(కోరుట్ల): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం సజావుగా నిర్వహించాలని మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం మల్లాపూర్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. రూట్ అధికారులు, పోలింగ్ సిబ్బందితో మాట్లాడి, సూచనలు చేశారు. ఎన్నికల సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని స్థానిక అధికారులకు సూచించారు. కేంద్రాల్లో ఏజెంట్లకు, సిబ్బందికి ఫోన్ అనుమతి లేదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల వివరాలు ఓటర్లకు తెలిసేలా పోస్టర్లు అతికించాలని చెప్పా రు. ఆయన వెంట తహసీల్దార్ వీర్‌సింగ్, ఇతర అధికారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment