పొదుపు అలవర్చుకోవాలి
జగిత్యాలరూరల్: ప్రతిఒక్కరూ పొదుపు అలవాటు చేసుకోవాలని జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్ రామ్‌కుమార్ అన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా గురువారం జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్‌లో ఆర్‌బీఐ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆదాయ వ్యయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేటి పొదుపు రేపటి భవిష్యత్తుకు పునాది అన్నారు. ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ కోట మధుసూదన్, ఏపీఎం గంగాధర్, సీసీలు, వీవోఏలు, మహిళ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
సొసైటీల్లో వ్యవసాయ అధికారి తనిఖీలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని పలు సొసైటీలు, ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా నిల్వలపై జిల్లా వ్యవసాయ అధికారి రాంచందర్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సొసైటీలకు వచ్చిన యూరియా, సరఫరా రికార్డులు పరిశీలించారు. డీసీఎంఎస్ వెల్దుర్తిలో 450 బస్తాల యూరియా పంపిణీ సాఫీగా జరిగిందని, పీఏసీఎస్ కల్లెడలో 450 బస్తాల యూరియా నిల్వ ఉందని తెలిపారు. యూరియా అవసరాల దృష్ట్యా జిల్లాకు గురువారం 310 టన్నుల యూరియా వచ్చిందన్నారు. శుక్రవారం కూడా జిల్లాకు 540 టన్నుల యూరియా రానుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
కుటీర పరిశ్రమలతో ఉపాధి
● ఎంజీఐఆర్‌ఐ ప్రతినిధుల వెల్లడి
● జగన్నాథపూర్‌లో పర్యటన
రాయికల్: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు కుటీర పరిశ్రమలతో ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగవచ్చని ఎంజీఐఆర్‌ఐ ప్రతినిధులు తెలిపారు. గురువారం రాయికల్ మండలం జగన్నాథపూర్‌లోని మురళీధర గోదాములో గ్రామీణ రసాయన పరిశ్రమలు, ఖాదీవస్త్ర విభాగం, గ్రామీణ ఊర్జా మౌలిక సదుపాయాలు, గ్రామీణ హస్తకళ ఇంజినీరింగ్ వంటి అంశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించారు. వీటి ద్వారా ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు చెన్నమనేని పద్మ, ప్రతినిధులు ప్రశాంత్, సందీప్, జోషి, జయకిశోర్, మహేశ్, మధుకర్, మాజీ సర్పంచులు తురగ రాజిరెడ్డి, కోల శ్రీనివాస్ పాల్గొన్నారు.
పొదుపు అలవర్చుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment