యూరియా కోసం రైతుల పాట్లు
కోరుట్లరూరల్: మండలంలోని పైడిమడుగు పీఏసీఎస్‌లో రైతులు యూరి యా కోసం పాట్లు పడుతున్నారు. గురువారం పీఎసీఎస్ గోదాంకు యూరి యా చేరుకోగా రైతులు పరుగులు తీశారు. కొందరు క్యూలైన్లో ఉండగా.. చాలామంది తమ చెప్పులు, ఇటుకలు, రాళ్లను లైన్లో పెట్టారు. తమ వంతు ఎప్పుడు వస్తుందోనని పడిగాపులు కాశారు. ఒక్కో ఆధార్‌కార్డుపై ఒక్కటే బస్తా ఇవ్వడంతో యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడ్డారు. డిమాండ్‌కు తగినట్లు యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
కళాశాలకు అఫిలియేషన్ తీసుకొస్తా..
● అగ్రికల్చర్ విద్యార్థులకు ఎమ్మెల్యే సంజయ్ భరోసా
కోరుట్ల: కోరుట్లలోని బీఎస్సీ అగ్రికల్చర్ మహిళా కళాశాలకు అఫిలియేషన్ తీసుకవచ్చే బాధ్యత తాను తీసుకుంటానని స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని అల్లమయ్య గుట్ట వద్ద గల రెసిడెన్షియల్ కళాశాలను గురువారం సందర్శించారు. విద్యార్థినుల కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు అవసరమైన ఏర్పాట్లు కల్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. కళాశాలలో ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తేవాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట కళాశాల సిబ్బంది, పలువురు నాయకులు ఉన్నారు.
యూరియా కోసం రైతుల పాట్లు
Comments
Please login to add a commentAdd a comment