షూతో విత్తన సీడింగ్
సప్తగిరికాలనీ(కరీంనగర్)/గంగాధర(చొప్పదండి): పొలంలో విత్తనాలు విత్తడం అంటే అన్నదాతలకు ఎంతో శ్రమతో కూడుకున్న పని. యంత్రాలతో విత్తనాలు విత్తడం ఆర్థికభారంతో కూడుకుంది. దీంతో రైతులకు ఇరువిధాలుగా ఇబ్బందులు ఎదురవుతోందని గ్రహించి, తన మేథస్సుతో సీడ్ విత్తే షూ తయారు చేసింది ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి జెడ్పీస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఎం.రితిక సైన్స్ ఉపాధ్యాయుడు జగదీశ్వర్‌రెడ్డి సహకారంతో రైతుల కోసం సీడ్ విత్తే షూ తయారు చేసింది. 2023–24 సంవత్సరానికి గానూ మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ మనక్‌లో ప్రదర్శించి, జాతీయస్థాయి ఇన్‌స్పైర్ మనక్‌కు ఎంపికై ంది. ‘విత్తన షూ వేసుకుని అడుగు పెట్టినపుడు ఒత్తిడి మెషిన్ లివర్‌పై పడుతుంది. లివర్ షూ విత్తనాల చాంబర్ నుంచి విత్తన విడుదలకు స్థలాన్ని ఇస్తుంది. ఇది నాజిల్‌తో జత చేయబడుతుంది. నాజిల్ మట్టిలోకి డ్రిల్ చేస్తుంది. స్ప్రింగ్‌ల శక్తితో విత్తనాన్ని వదులుతుంది. మరో అటాచ్‌మెంట్ రబ్బరు మట్టి డిస్టర్బర్ విత్తనాన్ని కప్పడానికి రంధ్రం వైపుల నుంచి మట్టిని వదులుతుంది. మొక్కజొన్న, సోయాబిన్, ఆవాలు, పప్పులు, వేరుశనగ పంటలు విత్తడానికి ఇది అనుకూలం. చిన్న, సన్నకారు రైతులకు ఇది సహాయకారిగా ఉంటుంది’ అని రితిక వివరించింది.
●
– వివరాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment