‘ఇన్‌స్పైర్’ చేస్తున్నారు
సైన్స్.. జీవితంలో ఒకభాగం.. పొద్దున నిద్రలేచినప్పటి నుంచి వేసే ప్రతీ అడుగులో.. చేసే ప్రతి పనిలో సైన్స్ దాగి ఉంటుంది. సైన్స్ అంటేనే అద్భుతం.. సంచలనాత్మక ఆవిష్కరణలకు నిలయం. మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో స్కూళ్లలో చదివే పిల్లల నుంచి శాస్త్రవేత్తల వరకు నిత్యం ఏదో ఒక అంశంలో ఆవిష్కరణలపై కసరత్తు చేస్తున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది బాల మేథావులు పుట్టుకొస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్స్‌ఫేర్, ఇన్‌స్పైర్ మనక్ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల నుంచి చాలా మంది రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. 28 ఫిబ్రవరి 1928న భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ.రామన్.. రామన్ ప్రభావాన్ని కనుగొన్నందుకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అతని ఆవిష్కరణకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నేడు సైన్స్‌డే సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు బాలమేథావుల ఆవిష్కరణలపై ప్రత్యేక కథనం.
Comments
Please login to add a commentAdd a comment