కనులపండువగా శివపార్వతుల రథోత్సవం
రాయికల్: రాయికల్ పట్టణంలోని చెన్నకేశవనాథ ఆలయంలో గురువారం శివపార్వతుల రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. అర్చకులు రమేశ్‌శర్మ, సతీశ్‌శర్మ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథంపై శోభాయాత్ర చేపట్టారు. వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మచ్చ శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, కోశాధికారి శ్రీనివాస్, కార్యదర్శి మంతెన మహేందర్, సంయుక్త కార్యదర్శి సంకోజి అశోక్, ప్రచార కార్యదర్శి నిరంజన్‌గౌడ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment