నయనానందం
సారంగాపూర్/మల్లాపూర్: సారంగాపూర్ మండలం దుబ్బరాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన రథోత్సవానికి భక్తజనం తరలివచ్చారు. ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించిన అనంతరం పల్లకిలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి రథం ఆసీనులు చేశారు. స్వామివారి నామస్మరణ మధ్య భక్తులు రథాన్ని ముందుకు లాగుతూ కదిలారు. విచిత్ర వేషధారణలు, కోలాటాలు, శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. గంటన్నరపాటు రథోత్సవం వైభవంగా సాగింది. అలాగే మల్లాపూర్ శ్రీకనక సోమేశ్వరస్వామి జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12గంటలకు రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి ఓం నమఃశివాయా అంటూ రథోత్సవంలో పాల్గొన్నారు.
మల్లాపూర్‌లో రథోత్సవంలో పాల్గొన్న భక్తజనం
రథోత్సవం సందర్భంగా జనసంద్రమైన దుబ్బరాజన్న సన్నిధి
Comments
Please login to add a commentAdd a comment