సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలి
జగిత్యాల: సైన్స్ అంటేనే పరిశీలన, ప్రయోగాలు అని డీఈవో రాము అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని పలు స్కూళ్లలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 1987 నుంచి జాతీయ సైన్స్ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్‌లో శాస్త్రవేత్తలు కావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరన, క్విజ్, చిత్రలేఖనం, ప్రాజెక్ట్‌ల ప్రదర్శన తదితర వాటిపై పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
అలసత్వం ప్రదర్శించొద్దు
జగిత్యాల: కొత్తగా ఉపాధ్యాయులుగా నియమితులైన వారు విధుల పట్ల అలసత్వం ప్రదర్శించొద్దని డీఈవో రాము అన్నారు. డీఎస్సీ– 2024 ద్వారా నియామకమైన ఎస్జీటీలకు వీక్లీబజార్ ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. ఆర్పీలు జయంత్, ఉమేశ్, మహేశ్, కుమార్ పాల్గొన్నార
సేవలతోనే ఉద్యోగులకు గుర్తింపు
కథలాపూర్(వేములవాడ): ప్రజలకు సేవలందిస్తేనే ఉద్యోగులకు గుర్తింపు ఉంటుందని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ అన్నారు. కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్‌ఎన్‌గా పనిచేసిన లూసి ఉద్యోగ విరమణ సభ శుక్రవారం జరిగింది. పీహెచ్‌ఎన్ సేవలను అధికారులు కొనియాడి జ్ఞాపికలు అందించి శాలువాలతో సన్మానించారు. డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, పీవో శ్రీనివాస్, వైద్యాధికారులు సింధూజ, రజిత, హెల్త్ సూపర్‌వైజర్ శ్రీధర్, రాజన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
రాయికల్ మున్సిపల్ కమిషనర్‌గా మనోహర్‌గౌడ్
రాయికల్(జగిత్యాల): రాయికల్ మున్సిపల్ కమిషనర్‌గా శుక్రవారం మనోహర్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
కూలీల సంఖ్య పెంచండి
రాయికల్(జగిత్యాల): ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీవో రఘువరణ్ సూచించారు. శుక్రవారం రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలోని ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ గ్రామంలో 50 మంది కూలీలకు తగ్గకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత కార్యదర్శులు, ఫీల్డ్ అసిసెంట్లపై ఉందన్నారు. వేసవికాలం దృష్ట్యా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో దివ్య, కార్యదర్శి స్వర్ణ, టెక్నికల్ అసిస్టెంట్ వీణరాణి, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్, కారోబార్ ప్రశాంత్ పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాల పరిశీలన
ధర్మపురి/బుగ్గారం: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అధికారి గంగాధర్ అన్నారు. శుక్రవారం ధర్మపురిలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. కేంద్రాల్లో వసతుల గురించి ఎస్సెస్సీ బోర్డుకు నివేదిక అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బుగ్గారం మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించి వసతులను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో సీతాలక్ష్మి, హెచ్‌ఎం మోహన్‌రెడ్డి, సీఆర్‌పీ పురుషోత్తం తదితరులు ఉన్నారు.
సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలి
సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలి
సైన్స్‌పై అవగాహన పెంచుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment