అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత కోసం చర్యలు
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా సంక్షేమశాఖ అధికారి నరేశ్ అన్నారు. మెట్‌పల్లి మండలం పాటిమీది తండాలో శుక్రవారం జరిగిన అంగన్వాడీ టీచర్ల సెక్టార్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. పోషన్ అభియాణ్ ట్రాకర్ అమలుపై ఆరా తీశారు. యాప్‌లో పొందుపర్చాల్సిన అంశాలు, ఈకేవైసీ విషయంలో ఎందుకు తాత్సారం జరుగుతుందని టీచర్లను అడిగి తెలుసుకున్నారు. దీంతో సాంకేతికంగా సమస్యలు తలెత్తుతున్నాయని టీచర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింతా మెరుగ్గా నిర్వహించాలని సూచించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ షెమీమ్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment