లోక్‌ అదాలత్‌కు పోలీసుల సహకారం అవసరం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌కు పోలీసుల సహకారం అవసరం

Published Sun, Mar 2 2025 2:13 AM | Last Updated on Sun, Mar 2 2025 2:08 AM

లోక్‌

లోక్‌ అదాలత్‌కు పోలీసుల సహకారం అవసరం

జగిత్యాలజోన్‌: ఈనెల 8న జరిగే లోక్‌ అదాలత్‌కు పోలీసులు సహకరించాలని జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ అన్నారు. జిల్లా కోర్టులో న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోక్‌అదాలత్‌పై పోలీసులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్జి నారాయణ మాట్లాడుతూ రాజీకి అనుకూలమైన కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకునేలా చూడాలని కోరారు. లోక్‌అదాలత్‌లో క్రిమినల్‌ కేసులతోపాటు సివిల్‌ కేసులను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి సుబ్రహ్మణ్యశర్మ మాట్లాడుతూ కేసులను రాజీ చేసుకోవడం ద్వారా కక్షిదారులకు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ రఘుంచందర్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఇబ్రహీంపట్నం: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రాము అన్నారు. మండలంలోని గోధూర్‌, ఇ బ్రహీంపట్నం మోడల్‌ స్కూళ్లలో ఏర్పాటు చేసి న పరీక్షకేంద్రాలను శనివారం పరిశీలించారు. కేంద్రాల్లో వసతులు పరిశీలించారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి భయపడకుండా పరీక్షలు రాయాలని సూచించారు. తిమ్మాపూర్‌ హైస్కూల్‌లో వసతులు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈవో మధు, ఉపాధ్యాయులు ఉన్నారు.

కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి

కథలాపూర్‌: పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఈవో సూచించారు. మండలంలోని గంభీర్‌పూర్‌, అంబారిపేట, కథలాపూర్‌ జెడ్పీ హైస్కూల్‌, మోడల్‌ స్కూల్‌ కేంద్రాలను పరిశీలించారు. సీసీ కెమెరాలను త్వరగా బిగించాలన్నారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాస్‌, మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ అనిత, ఉపాధ్యాయులు ఉన్నారు.

‘నక్ష’ సన్నాహక సర్వే ప్రారంభం

జగిత్యాల: భూమి, భవనాలకు పక్కాగా లెక్క ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం నక్ష కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల హెలికాప్టర్‌ ద్వారా జిల్లా కేంద్రంలో సర్వే కూడా చేపట్టారు. అయితే ఎమ్మెల్సీ కోడ్‌ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. కోడ్‌ ముగియడంతో శనివారం సన్నాహక సర్వేను ల్యాండ్‌ అండ్‌ రికార్డ్స్‌ అధికారులు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని బౌండరీలను గుర్తిస్తున్నారు. మ్యాప్‌ వచ్చిన అనంతరం పూర్తిస్థాయిలో బౌండరీలు ఏర్పాటు చేసి సర్వే నంబర్లు, భవనాల సమాచారమంతా మున్సిపాలిటీలో అందుబాటులోకి తేనున్నారు. డెప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ విఠల్‌ ఆధ్వర్యంలో జగిత్యాల చుట్టుపక్కల బౌండరీలు ఏర్పాటు చేసేందుకు సర్వే చేశారు.

ఘనంగా ఎడ్ల బండ్ల పోటీలు

ధర్మపురి: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని నేరెల్ల సాంబశివ ఆలయం వద్ద శనివారం ఎడ్లబండ్ల పోటీలను నిర్వహించారు. ప్రథమ బహుమతిని దుబ్బటి సాయికుమార్‌ (సీతారాంపల్లె), రెండో బహుమతి మాదాసు శంకరయ్యకు కాంగ్రెస్‌ గ్రామ అధ్యక్షుడు కాసారపు బాలాగౌడ్‌, విమల దంపతులు, బైరి ఎల్ల య్య ఐదు గ్రాముల బంగారం, ద్వితీయ బహుమతిని షేక్‌ బాషుమియా (తిరుమలాపూర్‌)కు 10 గ్రాముల వెండిని తీగళ తిరుపతిగౌడ్‌ బహూకరించారు. ఆలయ కమిటీ చైర్మ న్‌ కాసారపు రాజాగౌడ్‌, వైస్‌ చైర్మన్‌ జాజాల రమేశ్‌, రెడ్డవేని సత్యం, శేర్ల రాజేశం, పలిగిరి సత్యం, ఆలయ కమిటీ సభ్యులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
లోక్‌ అదాలత్‌కు పోలీసుల సహకారం అవసరం1
1/3

లోక్‌ అదాలత్‌కు పోలీసుల సహకారం అవసరం

లోక్‌ అదాలత్‌కు పోలీసుల సహకారం అవసరం2
2/3

లోక్‌ అదాలత్‌కు పోలీసుల సహకారం అవసరం

లోక్‌ అదాలత్‌కు పోలీసుల సహకారం అవసరం3
3/3

లోక్‌ అదాలత్‌కు పోలీసుల సహకారం అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement