వడదెబ్బ బారిన పడొద్దు
జగిత్యాల: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ సూచించారు. పెరిగిన ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ శరీరంలో బలహీనపడి వడదెబ్బకు గురవుతారని, రక్తనాళాలు కుచించుకుపోవడంతో కిడ్నీలు, లివర్ వంటి అవయవాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఎండలో తిరిగితేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తుంటారని, ఇంట్లో కూర్చున్నా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని వివరించారు. హ్యూమన్ హెల్త్ అధికారి డాక్టర్ అర్చన మాట్లాడుతూ.. శరీర ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీల ఫారెన్ హీట్‌కు పెరిగితే వడదెబ్బకు గురైనట్లు గుర్తించాలన్నారు. 60ఏళ్లు పైబడిన వృద్ధులు, చిన్నారులు, క్రీడాకారులు ఉపాధి కూలీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలని, వదులుగా ఉండే దుస్తులు ధరించాలని సూచించారు. తడిగుడ్డతో ఒళ్లంతా తుడిచి గాలి తగిలేలా చూడాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు వెళ్లకూడదన్నారు.
దుర్గల్యాబ్ సీజ్
జిల్లా కేంద్రంలో అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్‌లను డీఎంహెచ్‌వో తనిఖీ చేశారు. అనుమతి లేని పాతబస్టాండ్ సమీపంలోని దుర్గ ల్యాబ్, జంబిగద్దెలోని కేర్ ల్యాబ్‌ను సీజ్ చేశారు. ఆస్పత్రులన్నీ అనుమతి తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు.
పంచాయతీ సిబ్బంది వేతనాలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలి
జగిత్యాలరూరల్: గ్రామపంచాయతీ సిబ్బంది, కార్మికుల వేతనాలు బ్యాంక్ ఖాతాల్లో జమచేయాలని గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి పులి మల్లేశం అన్నారు. మంగళవారం జిల్లా ఇన్‌చార్జి డీపీవో మదన్‌మోహన్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతినెలా గ్రీన్‌ఛానల్ ద్వారా 2025 జనవరి ఒకటి నుంచి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించిన విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీవో ట్రెజరీలో నిలిచిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భద్రతపై దృష్టి సారించాలని కోరారు. బడ్జెట్‌లో కార్మికుల వేతనాలకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బేర సంతోష్, సాతల్ల రాజేందర్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment