‘వికసిత్ భారత్’ నోడల్‌గా జిల్లా ఎంపిక
జగిత్యాల: జిల్లాతోపాటు రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ వికసిత్ భారత్ పార్లమెంట్ కార్యక్రమాల నిర్వహణకు జిల్లాకేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎంపికై ంది. కేంద్ర, యోజన సర్వీస్ శాఖ దేశవ్యాప్తంగా 300 కళాశాలల్లో 2024–25 సంవత్సరానికి గాను యూత్ పార్లమెంట్ కార్యక్రమాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ మూడు జిల్లాల బాధ్యతలను ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలకు అప్పగించారు. ఆయా జిల్లాల్లోని విద్యార్థులు, యువకులు మైభారత్ పోర్టల్‌లో ఈనెల 9లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నోడల్ జిల్లాస్థాయిలో ఎంపికై న వారిని రాష్ట్రస్థాయికి పంపిస్తారు. రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయి పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆసక్తి గలవారు మైభారత్ పోర్టల్‌లో మెగా ఈవెంట్ క్లిక్ చేసి పేర్లు నమోదు చేసుకుని వికసిత్ భారత్ యువపార్లమెంట్ అంశంపై ఒక నిమిషం వీడియో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 75 ఏళ్ల భారత రాజ్యాంగం విధులు, హక్కులు, ప్రగతి అంశంపై ఉపన్యాసం ఉంటుంది. జా తీయస్థాయికి వెళ్లిన వారు ‘ఒకే దేశం – ఒకే ఎన్నికల్లో భాగంగా ప్రజాస్వామ్యాన్ని సరళీకృతం చేయడం, ప్రగతిని విస్తరించడం, స్థిరత్వాన్ని నిర్ధారించడం’ అంశంపై ప్రసంగించాల్సి ఉంటుంది. వివరాలకు జగిత్యాలలోని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఆడెపు శ్రీనివాస్, కందుకూరి శ్రీనివాస్, జిల్లా యువజన అధికారి రాంబాబును 9490683621, 9177656166 నంబర్లలో సంప్రదించాలని ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. ఈనెల 9 లోపు ప్రతిఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment