● కలెక్టర్ సత్యప్రసాద్
కథలాపూర్/ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. కథలాపూర్ మండలం పోసానిపేట, ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్‌తండాలో ఇళ్ల నిర్మాణాలను మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలని, బేస్‌మెంట్ లెవెల్‌లో రూ.లక్ష, గోడ నిర్మాణందశలో రూ.లక్ష, స్లాబ్ దశలో రూ.రెండు లక్షలు, ఇల్లు నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన రూ.లక్ష అందిస్తామని వెల్లడించారు. ఎర్రాపూర్, ఎర్రాపూర్‌తండాలో 42 మందికి ఇళ్లు మంజూరైనా నలుగురు మాత్రమే ముగ్గు పోశారు. మిగిలినవా రు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని కలెక్టర్ ప్ర శ్నించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా పెద్దగా నిర్మించుకుంటే సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. డీపీవో మదన్‌మోహన్, గృహ ని ర్మాణశాఖ జిల్లా అధికారి ప్రసాద్, ఎంపీడీవోలు శంకర్, చంద్రశేఖర్, ఎంపీవో రాజశేఖర్, తహసీ ల్దార్ ప్రసాద్, ఆర్‌ఐ నాగేశ్ ఉన్నారు. యూరియా సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు
మెట్‌పల్లిరూరల్: యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ గోదాంను మంగళవారం తనిఖీ చేశారు. యూరియా నిల్వలను పరిశీలించారు. ఈ పాస్ ద్వారా మాత్రమే విక్రయాలు చేపట్టాలన్నారు. మెట్‌పల్లి ఏవో దీపిక, ఎంపీడీవో మహేశ్వర్‌రెడ్డి, ఏఈవో మనోజ్ఞ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment