సకాలంలో పనులు పూర్తిచేయాలి
బుగ్గారం: ఉపాధి పనులను సకాలంలో పూర్తి చేయాలని డీఆర్డీవో పీడీ రఘువరణ్ సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రంలో మంగళవారం తనిఖీలు చేశారు. ఈజీఎస్ ద్వారా చేపడుతున్న వివిధ పనులను అడిగి తెలుసుకున్నారు. మహిళాశక్తి కార్యక్రమాలను పరిశీలించారు. నర్సరీ, పశువుల పాకల ప్రగతిని తెలుసుకున్నారు. కూలీల సంఖ్య పెంచి పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఏపీడీ చరణ్‌దాస్, ఏపీఎం మోహన్‌దాస్, సీసీలు జక్క శ్రీనివాస్, సత్యనారాయణ, శ్రీనిధి మేనేజర్ రమాదేవి, ఎంపీడీవో అఫ్జల్‌మియా, ఏపీవో సృజన్ స్థానిక సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment