పసుపు పంటకు రూ.15వేలు చెల్లించండి
మెట్‌పల్లి: పసుపు పంట క్వింటాల్‌కు రూ.15వేల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. పలువురు మాట్లాడుతూ గతేడాది క్వింటాల్‌కు రూ.16వేల నుంచి రూ.18వేల ధర దక్కితే.. ఈ ఏడాది రూ.11వేలకు మించి రావడం లేదన్నారు. గిట్టుబాటు ధర అందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. వైఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్దతు ధర అందించి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర అందించాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేశ్‌రెడ్డి, పన్నాల తిరుపతిరెడ్డి, మామిడి నారాయణరెడ్డి, మారు మురళీధర్‌రెడ్డి, గురిజెల రాజిరెడ్డి, కొమ్ముల సతీశ్, చిలువేరి తిరుపతి, పాపన్న, నాగేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment