No Headline
గొల్లపల్లి: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ ఏడాది ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళిక రూపొందించారు. ఈనెల 21నుంచి వచ్చేనెల 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి విద్యార్థి ఉతీర్ణుడు కా వాలని, జిల్లా శతశాతం సాధించాలనే ప్రధాన ల క్ష్యంతో అన్ని ఉన్నత పాఠశాలల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఆదివారం వారాంతపు పరీక్షలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఉదయం, సాయంత్రం చదువుకునేలా ఫోన్‌కాల్స్ చేసి ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల తరగతులకు అదనంగా రెండు గంటల పా టు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. విద్యార్థులకు పరీక్షలపై భయాందోళన తొలగిస్తున్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులు కూడా దృష్టి సారించాలని, ఇంటివద్ద చదువుకునేలా చూడాలని చెబుతున్నారు.
11,855 మంది విద్యార్థులు
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు 11,855 మంది ఉన్నారు. వీరంతా పరీక్షలు రాయడానికి సన్నద్ధమవుతున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను గుర్తించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు రాబట్టేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.
త్వరలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ గ్రేడ్ సాధించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకున్నాను. ఆ ప్రకారంగానే చదువులో ముందుకెళ్తున్నాను. పాఠశాలలో స్టడీ అవర్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు.
– ఏ.ప్రియ, పదో తరగతి విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment