సృజనా టెక్‌ఫెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ
కోరుట్ల: పట్టణ శివారులోని పాలిటెక్నిక్‌లో బుధవారం నిర్వహించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాస్థాయి సృజనా టెక్‌ఫెస్ట్‌లో ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ సిరిసిల్ల, కోరుట్ల పాలిటెక్నిక్ మెకానికల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. సిరిసిల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఆటోమెటెడ్ హమర్ మెషన్, కోరుట్ల విద్యార్థులు ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సోలార్ పవర్ హ్యాక్‌సా ప్రాజెక్టులను ప్రదర్శించారు. టెక్‌ఫెస్ట్‌లో న్యాయ నిర్ణేతలుగా జేఎన్టీయూ మంథని మెకానికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ శివరామకృష్ణ, కోరుట్ల ఆర్టీసీ డిపో సూపరింటెండెంట్ ఎండీ.సాదిక్ అలీ వ్యవహరించారు. కోరుట్ల విద్యార్థులు తయారు చేసిన ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సోలార్ పవర్ హ్యాక్‌సా ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. కార్యక్రమంలో సృజన టెక్‌ఫెస్ట్ కో–ఆర్డీనేటర్ వి. కాంతయ్య, ఇన్‌చార్జి హెచ్‌ఓడీ సివిల్ ఆఫీస్ సూపరింటెండెంట్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment