ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

Published Tue, Mar 11 2025 12:36 AM | Last Updated on Tue, Mar 11 2025 12:36 AM

ప్రజా

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ● పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు

కల్యాణం కమనీయం

మల్లాపూర్‌: మండలంలోని రాఘవపేటలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని అర్చకులు మాధవాచార్యులు సోమవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సరోజన దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మహిళలు సాముహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ నత్తి లావణ్య, నాయకులు పాల్గొన్నారు.

7

బాధితులకు సత్వర న్యాయం చేయాలి

జగిత్యాలక్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల కు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్‌ నిర్వహించారు. జిల్లాలోని వి విధ ప్రాంతాలకు చెందిన 14 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చే రువ చేయడమే లక్ష్యంగా ప్రజాసమస్యలను ప రిష్కరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే క్షయవ్యాధి నిర్మూలన

కథలాపూర్‌: క్షయవ్యాధిని నిర్మూలించడమే లక్ష్యమని, ఇందుకు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని ఊట్‌పల్లి, రాజారాంతండాల్లో సోమవారం పర్యటించారు. స్థానిక అధికారులతో పంచాయతీ కార్యాలయాల్లో సమావేశమయ్యారు. క్షయవ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు పంచాయతీ అధికారులు సహకరించాలన్నారు. ఈ రెండు గ్రామాల్లో క్షయవ్యాధిగ్రస్తులు లేకపోవడం విశేషమన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు ఇమ్రాన్‌, శ్రీధర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ చిన్నరాజం, కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

గ్రూప్‌–1 ఫలితాల్లో రాయికల్‌ యువకుడి ప్రతిభ

రాయికల్‌: పట్టణానికి చెందిన సురతాని అరవింద్‌రెడ్డి సోమవారం విడుదలైన గ్రూప్‌–1 ఫలితాల్లో 421 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు. సురతాని మల్లారెడ్డి, భాగ్యలక్ష్మీ కుమారుడు అరవింద్‌రెడ్డి కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కళాశాలలో ఇంటర్‌, ఢిల్లీలో బీఏ, ఎంఏ ఎకానమిక్స్‌ పూర్తి చేశాడు. యూజీసీ నెట్‌లో అర్హత సాధించి గ్రూప్‌–1 మొదటి ప్రయత్నంలోనే 421 మార్కులు సాధించాడు. అరవింద్‌రెడ్డిని పలువురు అభినందించారు.

జగిత్యాలటౌన్‌: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధితుల నుంచి కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై 50 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అనంతరం ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు పులి మధుసూదన్‌గౌడ్‌, జివాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

కోతుల బెడద నుంచి కాపాడండి

గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఇళ్లు పీకి పందిరేస్తున్నాయి. అన్ని పంటలకు నష్టం చేస్తున్నాయి. ఆరుతడి పంటలు, పండ్లు, కూరగాయల పంటలను తినడమే కాకుండా నాశనం చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి ఆహారం, వస్తువులను ధ్వంసం చేస్తున్నాయి.

– మేడిపల్లి మండలం, కొండాపూర్‌ గ్రామస్తులు

ఒకే వ్యక్తి.. రెండు చోట్ల విధులు

రాయికల్‌ మార్కెట్‌ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కొయ్యడ శ్రీనివాస్‌ అదే మండలం కుమ్మరిపల్లిలో రేషన్‌ షాపు కూడా నిర్వహిస్తున్నాడు. ఏకకాలంలో రెండు విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఈ విషయమై ఈ ఏడాది జనవరి 27న ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేశాను. ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. 25 ఏళ్లుగా రెండుచోట్ల విధులు నిర్వర్తిస్తూ ప్రభు త్వ సొమ్మును అక్రమంగా పొందుతున్న శ్రీని వాస్‌పై చర్యలు తీసుకోవాలి. కడకుంట్ల రమేష్‌

శ్మశాన వాటిక, ప్రభుత్వ స్థలం కాపాడాలి

జిల్లాకేంద్రంలోని ధరూర్‌క్యాంపు సర్వేనంబర్‌ 363, 364లోగల ఎస్సారెస్పీ స్థలాన్ని కొందరు ఆక్రమించి ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారు. అదే స్థలాన్ని ఆనుకుని ఉన్న శ్మశాన వాటికను కూడా కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ విషయమై ఎస్సారెస్పీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.

– జగిత్యాల తొమ్మిదోవార్డు ప్రజలు

డబ్బుల్‌ ఇళ్లను పంపిణీ చేయండి

జగిత్యాల అర్బన్‌ మండలం నూకపల్లిలో గత ప్రభుత్వం నిర్మించిన 3500 ఇళ్లలో 800 ఇళ్లను ఇంకా లబ్ధిదారులకు అప్పగించలేదు. ఆ ఇళ్ల వద్ద పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించి అర్హులైన పేదలకు పంపిణీ చేయండి.

– భారత్‌ సురక్షా సమితి ప్రతినిధులు

సోలార్‌ప్లాంట్‌ ఆలోచనలో ఉన్నాం

ప్రభుత్వం బస్సులివ్వడం ఊహించలేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, చెల్లించడమే తెలిసిన మాకు ఇది మంచి అవకాశం. నెలనెలా ఆర్టీసీ చెల్లించే డబ్బులతో సొలార్‌ ప్లాంట్లు పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే స్థలాలు పరిశీలిస్తున్నాం. సమాఖ్యను ఆర్థికంగా మరింత పరిపుష్టం చేస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్‌, సెర్ఫ్‌ సీఈవో దివ్యదేవరాజన్‌లకు ధన్యవాదాలు.

– హరిణి, ఉదయలక్ష్మి సమాఖ్య, చిగురుమామిడి

ప్రభుత్వానికి రుణపడి ఉంటాం

మా సమాఖ్యకు బస్సు రావడం సంతోషకరం. మా మీద నమ్మకంతో బస్సు కేటాయించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. నెలానెలా బస్సుల ద్వారా వచ్చే ఆదాయంతో కొత్త వ్యాపారాలు మొదలు పెడుతాం. మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యంగా ముందుకెళతాం.

సరిత, శ్రీచైతన్య మండల సమాఖ్య, ధర్మపురి

రోడ్డు నిర్మించండి

వెల్గటూర్‌ మండలం జగదేవుపేట నుంచి చెర్లపల్లి, వెల్గటూర్‌ వెళ్లే దారి గుంతలమయంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌, ఫైరింజన్‌, స్కూల్‌ బస్సులు కూడా వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామానికి రోడ్డు నిర్మించండి.

– వెల్గటూర్‌ మండలం, జగదేవుపేట గ్రామస్తులు

నర్సింగాపూర్‌లో భూకబ్జా

జగిత్యాల జిల్లా రూరల్‌ మండలం నర్సింగాపూర్‌ శివారు సర్వే నంబర్‌ 437లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడండి. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుకబట్టీలను సీజ్‌ చేయండి.

– సిరికొండ శ్రీనివాస్‌

ఆర్థికాభివృద్ధికి వినియోగిస్తాం

ప్రభుత్వం మా సంఘానికి కేటాయించిన ఆర్టీసీ బస్సు ద్వారా వచ్చే రూ.77 వేల ఆదాయాన్ని సంఘ సభ్యుల ఆర్థికాభివృద్ధికి ఉపయోగిస్తాం. ఆదాయ మార్గాలను అన్వేషించి, కొత్త వ్యాపారం కోసం త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సంఘ సభ్యులంతా సమావేశమై సమష్టిగా చర్చిస్తాం. – గుర్రాల మహేశ్వరి, అధ్యక్షురాలు,

రుద్రమ మండల సమాఖ్య, ముత్తారం

బస్సు రావడం సంతోషంగా ఉంది

మా మండల సమాఖ్యకు బస్సు రావడం సంతోషంగా ఉంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొదటి బస్సు మాకే ఇచ్చారు. మండల సమాఖ్య సమావేశం నిర్వహించి, ఆ మీటింగ్‌లో బస్సు నిర్వహణ ఖర్చుల విషయం, మాకు వచ్చే ఆదాయం చర్చించి ఏం చేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకుంటాం. మా సంఘంపై నమ్మకంతో బస్సును అందించినందుకు ధన్యవాదాలు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బస్సును అందించి బాసటగా నిలిచారు.

– పంచెరుపుల విజయ, అభ్యుదయ మహిళా సంఘం అధ్యక్షురాలు, జయవరం

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు1
1/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు2
2/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు3
3/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు4
4/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు5
5/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు6
6/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు7
7/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు8
8/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు9
9/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు10
10/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు11
11/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు12
12/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు13
13/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు14
14/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు15
15/15

ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement