
అంబేడ్కర్‌ను అవమానించడం సరికాదు
సారంగాపూర్: అంబేడ్కర్‌ను అవమానించడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నాగునూర్‌లో సోమవారం పర్యటించారు. గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. నిందితులకు శిక్షిపడేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. ఆయన వెంట జగిత్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కల్లెపల్లి దుర్గయ్య, నక్క జీవన్, మాజీ ఎంపీపీ ధర రమేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోండ్ర రాంచంద్రారెడ్డి, దళిత, అంబేద్కర్ సంఘాల నాయకులు పూడూరి శోభన్, మాలెపు సుధాకర్, ప్రశాంత, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment