పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..
సారంగాపూర్: సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. మండలంలోని బట్టపల్లి గ్రామంలో ఎండిపోతు న్న పంటలను ఆమె బుధవారం పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం రోజురోజుకూ దిగజారిపోతోందని, కాలువ చివరి భూములకు నీరందక బట్టపల్లి, పోతారం గ్రామాల్లో మొక్కజొన్న, వరి పంటలు పశుగ్రాసంగా మారాయని ఆవేదన వ్య క్తం చేశారు. ఎస్సారెస్పీ కాలువలపై అధికారు ల పర్యవేక్షణ కొరవడి చివరి భూములకు నీరుచేరక పంటలు ఎండి రైతులు ఆగమవుతున్నారని తెలి పారు. పలువురు రైతులను ఆమె ఓదార్చారు. బీ ఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, మాజీ సర్పంచ్ భూక్య అరుణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment