డ్రైనేజీలు అస్తవ్యస్తం
● కరువైన మరమ్మతు ● కొత్తవి నిర్మించరు.. పాతవి పట్టించుకోరు ● శానిటేషన్ మరిచిన అధికారులు ● నరకం అనుభవిస్తున్న ప్రజలు
జగిత్యాల: నూతన డ్రైనేజీలు నిర్మించరు.. ఉన్నవాటికి మరమ్మతు చేయరు అన్నచందంగా మారింది జిల్లాలోని మున్సిపాలిటీల తీరు. పాలకవర్గం ఉన్న సమయంలోనూ డ్రైనేజీలను పట్టించుకోకపోవడంతో మురికినీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. ప్రధానంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, మున్సిపాలిటీల్లోని డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో మురికినీరు రోడ్లపైకి చేరుతోంది. పర్యవేక్షించేవారు లేక పారిశుధ్య కార్మికులు వాటిపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ప్రజలు కూడా ప్లాస్టిక్, చికెన్ వ్యర్థాలను డ్రైనేజీల్లోనే వేస్తున్నారు. సాయంత్రం ఆరుగంటలు దాంటిదంటే ప్రతిఒక్కరూ తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు ఫాగింగ్ చేయకపోవడం, డ్రైనేజీల్లో ఆయిల్‌బాల్స్ వేయకపోవడంతో వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది.
ఇది జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్‌లోగల ప్రధాన కాలువ. డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం.. కాలనీకి చెందిన కొందరు చెత్త పడేయడంతో నీరు కదలలేని పరిస్థితి. పరిసరాలన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. శుభ్రం చేయాల్సిన పారిశుధ్య కార్మికులు వారానికోసారైనా తీయడం లేదు. పందులు, దోమలు విజృంభిస్తున్నాయి. కాలనీవాసులు రోగాల పాలవుతున్నారు.
డ్రైనేజీలు అస్తవ్యస్తం
డ్రైనేజీలు అస్తవ్యస్తం
డ్రైనేజీలు అస్తవ్యస్తం
Comments
Please login to add a commentAdd a comment