బ్యాంకులు రుణలక్ష్యం చేరుకోవాలి
జగిత్యాలజోన్: బ్యాంక్‌లు రుణలక్ష్యాన్ని చేరుకోవాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా బ్యాంక్‌ల సమన్వయ కమిటీ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలలో జాప్యం చేయరాదని, రానున్న మూడు నెలల్లో అత్యధిక రుణాలు అందించాలని సూచించారు. నాబార్డ్ డీడీఎం దిలీప్‌చంద్ర మాట్లాడుతూ.. ముద్ర, పీఎంఈజీపీ, ఎస్‌ఎస్‌జీ రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంకుమార్ మాట్లాడుతూ జిల్లాలో 26 బ్యాంక్‌లకు 133 శాఖలున్నాయని, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రుణాలు మంజూరు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆర్‌బీఐ ఎల్‌డీవో పృథ్వీ, వివిధ శాఖల జిల్లా అధికారులు రాజ్‌కుమార్, నరేశ్, కిశోర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment