డ్రైనేజీలు నిర్మించాలి
శివారు కాలనీల్లో డ్రైనేజీలు లేక ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. మురికినీరంతా రోడ్లపైకే వస్తోంది. దీని వల్ల ఇంట్లోకి దుర్వాసన వస్తోంది. దోమల బెడద ఎక్కువైంది. అధికారులు వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
– ఆగమయ్య, మెట్‌పల్లి
దుర్వాసన వస్తోంది
మురికికాలువలు తీయకపోవడం, డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో మురికినీరంతా బయటకు వస్తోంది. అధికారులు బ్లీచింగ్ పౌడర్ చల్లించాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలి. దుర్వాసన భరించలేకపోతున్నాం.
– రమణ, కోరుట్ల
ఏళ్ల తరబడి ఇలాగే..
డ్రైనేజీలను దశాబ్దకాలం క్రితం నిర్మించారు. కొత్త డ్రైనేజీలు నిర్మిస్తే మేలు. మురికినీరు వెళ్లకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. మురికికాలువలు శిథిలావస్థలో ఉండటంతో చెత్తాచెదారం పేరుకుపోతోంది.
– దేవేందర్, రాయికల్
కాలువలు శుభ్రం చేయాలి
జగిత్యాల జిల్లాకేంద్రం కావడంతో శివారు ప్రాంతాల్లో కొత్తగా ఇ ళ్లు కడుతున్నా రు. ఆ ప్రాంతంలో మురికికాలువలు లేక నీరంతా బ యటకు వస్తోంది. ముందుగా డ్రైనేజీ లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి.
– కిరణ్‌కుమార్, జగిత్యాల
డ్రైనేజీలు నిర్మించాలి
డ్రైనేజీలు నిర్మించాలి
డ్రైనేజీలు నిర్మించాలి
Comments
Please login to add a commentAdd a comment