నృసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా రవీందర్
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ పాలకమండలిని గురువారం ప్రకటించారు. ఈవో శ్రీనివాస్ సమక్షంలో 13 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఏడాది కాలపరిమితితో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ శైలజారామయ్యర్ జీవో నంబర్ 76 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‌గా జక్కు రవీందర్, ధర్మకర్తలుగా ఎదులాపురం మహేందర్, బాదినేని వెంకటేశ్, బొల్లారపు పోచయ్య, గుడ్ల రవీందర్, కొమురెల్లి పవన్‌కుమార్, మందుల మల్లేష్, నేదునూర్ శ్రీధర్, రాపర్తి సాయికిరణ్, సంబెట తిరుపతి, స్తంభంకాడి గణేష్, వొజ్జల సౌజన్య, అవ్వ సుధాకర్, ఎక్స్ అఫీషియో మెంబర్‌గా నేరెల్ల శ్రీధరాచార్యులుగా కొనసాగనున్నారు. నూతన పాలకమండలి సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో బుగ్గారం మాజీ జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, నాయకులు ఎస్. దినేష్, వేముల రాజు తదితరులున్నారు.
ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌గా శ్రీనివాస్
ధర్మపురి: ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌గా ధర్మపురికి చెందిన ఇమ్మడి శ్రీనివాస్‌ను నియమిస్తూ జీవో 209ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీనివాస్ ధర్మపురిలోని జూనియర్ సివిల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన ఏజీపీగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రౌతు రాజేష్, ఉపాధ్యక్షుడు రామడుగు రాజేశ్, ట్రెజరీ జాజాల రమేశ్, న్యాయవాదులు అభినందించారు.
నృసింహస్వామి ఆలయ గిరిప్రదక్షిణ
వెల్గటూర్: మండలంలోని కిషన్‌రావుపేటలోగల శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పూలతో అంకరించిన శావపై ఊరేగించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు స్వామివారి నామసంకీర్తనలతో గిరి ప్రదక్షిణ చేపట్టారు. చివరిరోజైన శుక్రవారం ఎడ్లబండ్ల పోటీలు ఉంటాయని ఆలయ కమిటీ చైర్మన్ నైనాల అజయ్ తెలిపారు.
హోలీని ఆనందంగా జరుపుకోవాలి
జగిత్యాలరూరల్: హోలీ వేడుకలను ఆనందంగా నిర్వహించుకోవాలని మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యువకులు అత్యుత్సాహం ప్రదర్శించరాదని, ద్విచక్ర వాహనాలపై ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది ముమ్మర పెట్రోలింగ్, డ్రంకెన్‌డ్రైవ్ చేపడతామన్నారు. స్నానాల కోసం అధిక నీటి ప్రవాహం, లోతైన ప్రదేశాల్లో వెళ్లి ప్రమాదాల బారినపడొద్దని హెచ్చరించారు. ఇతరులపై బలవంతంగా రంగులు చల్లడం.. గొడవ పడ డం.. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
లింగ నిర్ధారణ నేరం
జగిత్యాల: లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పలు స్కానింగ్‌సెంటర్లను మాతాశిశు సంరక్షణ అధికారి జైపాల్‌రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. రోగుల సౌలభ్యం కోసం వసతులు కల్పించాలని, వెంటిలేషన్, వే యింటింగ్ హాల్ తప్పకుండా ఉండాలని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ స్కా నింగ్ సెంటర్లను రిజిస్ట్రేషన్ ఉన్నవారే నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
నృసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా రవీందర్
నృసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా రవీందర్
నృసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా రవీందర్
Comments
Please login to add a commentAdd a comment