పల్లె దవాఖానాల్లో మెరుగైన వైద్యం
జగిత్యాలరూరల్: గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించేందుకు పల్లె దవాఖానాలు నిర్మిస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రూరల్ మండలం తక్కళ్లపల్లిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో భాగంగా రూ.20లక్షలతో నిర్మించనున్న పల్లె దవాఖానా నిర్మాణానికి గురువారం భూమిపూజ చేశారు. హన్మాజీపేట, బాలపల్లిలో రూ.31.50 లక్షలతో సీసీరోడ్డుకు శంకుస్థాపన చేశారు. తక్కళ్లపల్లిలో పల్లె దవాఖానా కోసం స్థలం అందించిన గడ్డం హన్మాన్‌రెడ్డిని సన్మానించారు. నాయకులు ముస్కు ఎల్లారెడ్డి, దశరథరెడ్డి, బాలముకుందం, రవీందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, విక్రమ్, రమణరెడ్డి, కృష్ణ, సతీశ్, నరేశ్, శంకర్, ప్రవీణ్‌రావు, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
జగిత్యాల: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని 29, 30 వార్డులు, న్యూ హైస్కూల్‌లో రూ.10 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఖాదర్, నాగయ్య, పంబాల రాముకుమార్, దుమాల రాముకుమార్, తోట మల్లికార్జున్, జగదీశ్, ధర్మరాజు, రాజేశ్ పాల్గొన్నారు.
శ్రీడబుల్‌శ్రీ ఇళ్లలో సదుపాయాలు
డబుల్ బెడ్‌రూం ఇళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. నూకపల్లి వద్దగల డబుల్‌బెడ్‌రూంలను పరిశీలించారు. లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లు అందిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జ్యోతి, ఏఎంసీ మాజీ చైర్మన్ దామోదర్‌రావు, కమిషనర్ చిరంజీవి ఉన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment